పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు స్కిల్ ట్రైనింగ్ - జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

నైపుణ్యాలను గుర్తించి ప్రత్యేక కోర్సుల రూపకల్పన జిల్లాలోని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను సర్వే ద్వారా గుర్తించి, వాటికి అనుగుణంగా ప్రత్యేక శిక్షణ కోర్సులు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఎన్ఐఈఎల్ఐటి, ఆర్సెట్టి, సిఐటీడీ, టాస్క్ తదితర సంస్థల సమన్వయంతో యువతకు శిక్షణ, ధ్రువీకరణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. స్థానిక పరిశ్రమలతో పాటు...