మున్సిపాలిటీ సమగ్ర అభివృద్దికి కట్టుబడి వున్నాము
మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది ప్రజా ప్రభుత్వంలో సూర్యాపేట పట్టణంలోని అన్ని వార్డులలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అమలు చేస్తామని సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. శుక్రవారం నాడు సూర్యాపేట పట్టణంలోని నాలుగో వార్డు నేత్యా తండాలో ఐదు లక్షల మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులతో నిర్మాణం చేయనున్న సిసి డ్రైన్ కు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో నాలుగో వార్డు కు 21 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయి, నిర్మాణం జరుగుతున్నాయని చెప్పారు. నాలుగో వార్డ్ లో బోర్ వెల్ తో పాటు పైపులైన్ నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన...