జిల్లా పోలీస్ కార్యాలయం నందు అమరవీరుల స్మారక కొవ్యోత్తుల ర్యాలీ
అమరవీరుల సంస్కరణ దినోత్సవం పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ ఈరోజు సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయం నందు అమరుల స్మారక కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు ప్రారంభించి పాల్గొన్నారు. కోవ్యోత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది, ఆర్మీ జవాను, కేంద్ర బలగాల జవానులు 24 గంటలు విధులు నిర్వహిస్తూ దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుతున్నారని సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయక పోరాడిన అమరవీరులు బడే సాహెబ్, లింగయ్య, మహేశ్వర్, కలమలాకర్...