మైనారిటీ సంక్షేమ శాఖలో అవినీతి, అక్రమ నియామకాలపై చర్యలు ఎప్పుడు
-కుట్టు మిషన్ల పంపిణీలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు -నియామక ఉత్తర్వులు లేకుండానే ఏళ్ల తరబడి ఉద్యోగం.. ప్రభుత్వ జీతం పొందుతున్నారని ఫిర్యాదు -ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం -కాంగ్రెస్ నాయకురాలు షబాన మహమ్మద్ ఆరోపణలు... -జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు.. చర్యలు తీసుకోకుంటే ధర్నా చేస్తామని హెచ్చరిక కరీంనగర్,అక్టోబర్29(స్టాఫ్ రిపోర్టర్):కరీంనగర్ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖలో జరుగుతున్నాయని ఆరోపిస్తున్న అవినీతి, అక్రమ నియామకాలు, కుట్టు మిషన్ల పంపిణీలో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హుస్సేన్పురా 33వ డివిజన్ కాంగ్రెస్ నాయకురాలు షబానా మహమ్మద్ జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా మైనారిటీ సంక్షేమ...