రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఎస్పీ నరసింహ, ఐపీఎస్
రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర వైద్య సేవలు అందించడానికి జిల్లాలోని 38 ఆసుపత్రుల ఎంపిక రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో వైద్య చికిత్స అందించి, వారి ప్రాణాలను కాపాడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రహత్ (PM RAHAT) పథకంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ నరసింహా ఐపీఎస్ గారు సూచించారు. జిల్లా పరిదిలో మొత్తం 38 ఆసుపత్రుల్లో ఈ పథకం కింద వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని అర్హత నిబంధనలకు అనుగుణంగా రూ.1.5 లక్షల వరకు గరిష్ఠంగా ఏడు రోజుల పాటు నగదు రహిత వైద్య చికిత్స పొందవచ్చని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే...