పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు చేసుకోండి ప్రెస్ కన్వీనర్ కందుకూరి లక్ష్మయ్య

తిరుమలగిరి 28 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు చేసుకోండి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసే దిశగా,అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తుంగతుర్తి నియోజకవర్గం ప్రెస్ కన్వీనర్ కందుకూరి లక్ష్మయ్య అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనాలంటే ముందుగా ఓటరుగా నమోదు చేసుకోవడం ముఖ్యమని తెలిపారు.అర్హత కలిగిన పట్టభద్రులందరూ ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని, తమ స్నేహితులు,సహచర పట్టభద్రులకు కూడా ఈ...