పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి..
ముఖ్యమైన పాయింట్స్:బిఆర్ఎస్ మండల నాయకుల సమావేశం అడ్డగూడూరు 27 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- తుంగతుర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గాదరి కిశోర్ కుమార్ ఆదేశానుసారం మంగళవారం రోజు అడ్డగూడూరు మండల కేంద్రంలో బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మండల పార్టీ అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి మరియు మోత్కూర్ మాజీ మార్కెట్ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్ లు మాట్లాడుతూ..అమలు కానీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చి అన్నీ వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేసిందని, విద్యార్థులకు ఫీజు రియంబెర్స్ మెంట్ ఇవ్వకుండా...