ఫాతిమా స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం బాలుడి తలకు గాయం

తిరుమలగిరి 27 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరి పట్టణ కేంద్రంలో గల ఫాతిమా హైస్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఒకటో తరగతి చదువుతున్న చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. పాఠశాల సమయం సాయంత్రం నాలుగు గంటలకే ముగిసినప్పటికీ, విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అప్పగించకుండా గంటల తరబడి స్కూల్లోనే ఉంచారు. సాయంత్రం ఆరు, ఏడు గంటలవుతున్నా కనీసం లైట్లు కూడా వేయకుండా చిన్న పిల్లలను చీకట్లోనే కూర్చోబెట్టారు. ఈ క్రమంలో ఒకటో తరగతి చదువుతున్న బట్టు రుద్రాంచచ్ నందన్ అనే విద్యార్థి చీకటిలో కాలుజారి కింద పడటంతో తలకు తీవ్ర గాయమై రక్తస్రావమైంది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు...