పల్లె ప్రకృతి వనాన్ని ఆక్రమించి, సెల్ టవర్ దందా నడిపిస్తున్న అవినీతి అధికారులపై
చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో పెద్దదిన్నె గ్రామస్తుల ఫిర్యాదు. జోగులాంబ గద్వాల 26 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. , ఇటిక్యాల.*మండల పరిధిలోని పెద్దదిన్నె గ్రామంలో ప్రభుత్వ ఆశయాలకు తూట్లు పొడుస్తూ కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న అక్రమాలపై పెద్దదిన్నె గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పల్లెల్లో హరితహారాన్ని పెంచాలని, పచ్చదనాన్ని కాపాడాలని కోట్లాది రూపాయలు వెచ్చించి పల్లె ప్రకృతి వనంను ఏర్పాటు చేసింది. కానీ, పెద్దదిన్నె గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో ఉన్న పచ్చని చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా నిర్దాక్షిణ్యంగా నరికేసి, ఆ స్థానంలో ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి సెల్ టవర్ నిర్మాణం చేపడుతున్నారు. ఈ...