ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ముఖ్యమైన పాయింట్స్:మంత్రి పొంగులేటికి ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల జేఏసీ నాయకుల వినతి ఖమ్మం, అక్టోబర్ 25:- జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ ఎం) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఖమ్మం జిల్లా ఎన్ హెచ్ ఎం జేఏసీ నాయకులు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టడానికి గల కారణాలను మరియు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. రాష్ట్రంలో సుమారు 17,600 మంది ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నప్పటికీ, ఉద్యోగ భద్రత, వేతనాలు, వైద్య సదుపాయాలు, ఇతర సేవా ప్రయోజనాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగ భద్రత...