ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
36ఏళ్ల తర్వాత కలుసుకున్న గుంపుల తిరుమలగిరి జడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థులు సూర్యాపేట: చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1989- 90 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలోని జీవీవీ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాటి విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలలోని తమ యొక్క నాటి స్మృతులు మరిచిపోలేని మధురానుభూతులని అన్నారు.36 ఏళ్ల తర్వాత నాటి విద్యార్థులంతా ఒకచోట కలుసుకొని జ్ఞాపకాలను పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు.తాము చదువుకున్న రోజులను, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకున్నారు.తమకు విద్యాబుద్ధులు నేర్పి నేడు ఉన్నత స్థాయిలో ఉండేలా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను ఘనంగా...