ఐపీ చానళ్ళకు అక్రెడిటేషన్లు లేవు

- తేల్చి చెప్పిన మంత్రి పొంగులేటి - జర్నలిస్టుల ఇళ్ళస్థలాలు, ఇతర సమస్యలను త్వరలో పరిష్కరిస్తాం హైదరాబాద్, అక్టోబర్ 24:- రాష్ట్రం కేబుల్ టీవీల స్థానంలో నడుస్తున్న ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్(ఐపీ) ఛానళ్ళకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వడం కుదరదని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తేల్చి చెప్పారు. ఇప్పటికే 26 వేల అక్రెడిటేషన్ కార్డులిచ్చామని,గతంలో కంటే నాలుగు వేల కార్డులు ఎక్కువే ఇచ్చామని, గతంలో లేని ఐపీ చానళ్ళకు కొత్తగా అక్రెడిటేషన్ కార్డులివ్వలేమని ఆయన స్పష్టం చేశారు. శనివారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య నేతృత్వంలో కేబుల్ చానల్స్ ప్రతినిధులు, పలువురు ఫెడరేషన్ నాయకులు...