పోలీసుల విధులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే పోలీస్ ఓపెన్ హౌస్..

పోలీసుల త్యాగాలను ప్రతి విద్యార్థి, పౌరుడు గుర్తుంచుకోవాలి: సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్.. సూర్యాపేట పట్టణం: పోలీస్ ఫ్లాగ్ డే, పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో విద్యార్థుల కోసం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్, సూర్యాపేట పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, సైబర్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, ఫింగర్‌ప్రింట్స్ ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు శాఖ విధులు, కేసుల దర్యాప్తు, నేరాల ఛేదన, నేరస్థులను గుర్తించే విధానాలు, ప్రజలకు అందిస్తున్న పోలీసు సేవలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన...