ఆత్మకూరు మైనర్ బాలిక మృతి కేసులో 24 గంటల్లో నిందితుడి అరెస్ట్

కేసు వివరాలు వెల్లడించిన సూర్యాపేట రూరల్ సీఐ జి. రాజశేఖర్. సూర్యాపేట జిల్లా, 26 అక్టోబర్, 2026:- ఆత్మకూరు (ఎస్) పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక మృతికి సంబంధించిన కేసులో నిందితుడిని పోలీసులు 24 గంటల్లో అరెస్ట్ చేసి, రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధింపులకు గురిచేసిన ఘటనలో వేధింపులు భరించలేక బాలిక ఈ నెల 22వ తేదీ రాత్రి మృతిచెందినట్లు కేసు నమోదైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో వాంకుడోతు నరేశ్, మాన్య తండా, ఏపూర్ తండా నివాసిని...