నేర పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన

తిరుమలగిరి 25 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు, పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ఎదుట విద్యార్థులకు పోలీస్ ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ వెంకట్ రెడ్డి విద్యార్థులకు పోలీసు శాఖ విధులు, నేర పరిశోధన, నేరాల ఛేదనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, పోలీసు విధివిధానాలు, నేరాల పరిశోధన, నేరస్థులను గుర్తించే పద్ధతులు, సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యత, మహిళలు, విద్యార్థులు, బాలల రక్షణలో పోలీసు శాఖ పాత్ర గురించి వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి...