కరువుతో గుండె బరువెక్కింది
ప్రకృతి ఎంత గొప్పది ప్రజలకు ఎంత మేలు చేస్తుంది సకాలంలో వర్షాలు కురిపించి, సమృద్ధిగా పాడిపంటలందిస్తుంది. ప్రాణవాయువును అందించి, స్వచ్ఛమైన తాగునీటినిచ్చి, కాలుష్యరహిత ఆహారాన్నందించి, కల్మషం లేని సహజీవనాన్ని నేర్పుతుంది. స్వార్థం పెరిగి, సంపాదనపై ఆశ మితిమీరి, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తే, ప్రకృతి వనరులన్నీ నశించిపోతాయి. సకాలంలో వానలు కురవక, సాగుకు నీరు అందక, పంటలు పండక, ఆహార కొరత ఏర్పడి, కరువు విలయతాండవం చేస్తుంది. పర్యావరణ మార్పులతో మూగజీవులు మృత్యువు అంచున నిలిచి, మనుషులు వలసబాట పట్టి, బతుకులన్నీ భారమై, జీవనమంతా గందరగోళమవుతుంది. నిపుణులు హెచ్చరించినా, ప్రభుత్వాలు అవగాహన కల్పించినా, పట్టణీకరణ పేరుతో ప్రకృతిని విధ్వంసం చేస్తే, మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ప్రకృతిని కాపాడుకోవాలనే...