అసలేం జరుగుతోంది రికార్డుల దగ్ధం వెనుక అసలు కథేంటి

ప్రభుత్వ కార్యాలయాల్లో వరుస ఘటనలు.. అనేక అనుమానాలు! జోగులాంబ గద్వాల 24 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.గద్వాల: ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రంగా ఉండాల్సిన కీలక రికార్డులు అగ్నికి ఆహుతవుతుండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు సంబంధించిన భూముల వివరాలు, ప్రభుత్వ ఆస్తుల సమాచారం, పరిపాలనా వ్యవహారాలకు ఆధారమైన పత్రాలు కాలిపోతుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు యాదృచ్ఛికమా? లేక వీటి వెనుక మరేదైనా కారణం ఉందా? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఒక్కో కార్యాలయంలో ఒక్కో ఘటన! మానవపాడు రెవెన్యూ కార్యాలయం, గద్వాల పంచాయతీరాజ్‌ కార్యాలయంలో రికార్డులు దగ్ధమైన ఘటనలు గతంలో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇరిగేషన్‌ కార్యాలయంలోనూ రికార్డులను తగలబెట్టినట్లు సమాచారం...