పీఎం రాహత్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి

జాతీయ రోడ్లపై ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత వైద్యం జోగులాంబ గద్వాల 24 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. గద్వాల.జాతీయ రోడ్లపై జరిగే ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్య సేవలు అందించే పీఎం రాహత్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాదు నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో పీఎం రాహత్ పథకం (రోడ్డు ప్రమాద బాధితులకు ఆసుపత్రి చికిత్స,భరోసాతో కూడిన వైద్య సేవల పథకం) అంశాపై మాట్లాడారు. ఈ...