రాష్ట్రంలోని జర్నలిస్టులకు తీపికబురు.. ఇళ్ల స్థలాల పంపిణీపై బిగ్ అప్డేట్
రాష్ట్రంలో ఏళ్లకు ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టుల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి చట్టపరమైన చిక్కులు లేకుండా, నివాసయోగ్యమైన ప్రాంతంలో స్థలాలు అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని ఇవాళ సచివాలయంలో జరిగిన అధికారుల సమీక్షలో ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. 2008లో ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి భూములు కేటాయించినప్పటికీ, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండటం వల్ల ప్రక్రియ నిలిచిపోయిందని మంత్రి గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే, 2024 సెప్టెంబర్ 8న రవీంద్రభారతిలో కార్యక్రమం నిర్వహించి సొసైటీకి భూమిని...