ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందించాలి

తాగునీటి నాణ్యత పరీక్షలు నిరంతరం నిర్వహించాలి సిబ్బంది హాజరు,రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు అక్రమ నీటి కనెక్షన్లను అరికట్టి, అందరికీ నీరు అందించాలి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జిల్లా ప్రజలకు నాణ్యమైన తాగునీటిని అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ధరూర్ మండలం జూరాల ప్రాజెక్టు నందు జిల్లా మిషన్ భగీరథ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ నీటి శుద్ధి ప్రక్రియ,నాణ్యత పరీక్షలు, రసాయనాల వినియోగం,సిబ్బంది హాజరు,రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించి,ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పీహెచ్‌,టర్బిడిటీ,...