ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు పక్కాగా అందాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. ఆత్మకూర్(ఎస్) మండలం మిడ్తనపల్లి గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్, ప్రైమరీ హై స్కూల్ ను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లోకి వెళ్లిన కలెక్టర్, విద్యార్థులతో నేరుగా సంభాషించారు. పాఠ్యాంశాలపై వారిని పలు ప్రశ్నలు అడిగి, వారి సందేహాలను ఎంతో ఓపిగ్గా నివృత్తి చేశారు. బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.అనంతరం పాఠశాలలోని వంట గదిను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యత, పారిశుద్ధ్య ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం పరిశుభ్రమైన, పౌష్టికాహారాన్ని...