భూ అక్రమాలపై ముగ్గురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్

Suryapet District News:- భూముల లావాదేవీల్లో తీవ్ర అవకతవకలు, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు రెవెన్యూ అధికారులపై జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ కఠిన చర్యలు తీసుకున్నారు. హుజుర్ నగర్ తహసీల్దార్‌ బి.కవిత(B.Kavitha), రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కాశీం షరీఫ్‌ ( Kashim Shareef), గ్రామ పాలన అధికారి (జీపీవో) ఎస్‌.కె. జానీ పాషా (SK Jhani Pasha)లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాపరమైన విచారణ పెండింగ్‌లో ఉండగానే ఈ చర్యలు చేపట్టారు. రికార్డులు పరిశీలించకుండానే లావాదేవీలు హుజూర్‌నగర్‌ గ్రామం, మండల పరిధిలోని సర్వే నంబర్లు 458, 281లో భూముల లావాదేవీలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. హుజూర్‌నగర్‌...