పోలీసు అమరవీరుల త్యాగాలు అజరామరం: సూర్యాపేట జిల్లా పోలీసు కళా బృందం

సూర్యాపేట జిల్లా, అక్టోబర్ 23: పోలీస్ ఫ్లాగ్ డే (Police Flag Day) మరియు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా సూర్యాపేట జిల్లా పోలీసు కళా బృందం ఆధ్వర్యంలో తిరుమలగిరి, నాగారం, మరియు అర్వపల్లి మండల కేంద్రాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా మండల కేంద్రాల ప్రధాన సెంటర్లలో కళా బృందం సభ్యులు పోలీసు అమరుల త్యాగాలను స్మరిస్తూ పాటలు, కళా రూపాలు, మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోలీసులు నిర్వర్తిస్తున్న విధులను, వారి త్యాగాలను కళాకారులు కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. సమాజంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొనడానికి, ప్రజలు హాయిగా...