ఉమ్మడి జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు గులాం అహ్మద్ ను సన్మానించిన మాజీ కౌన్సిలర్ సాబెర్ అలీ
కోరుట్ల, అక్టోబర్ 23:-ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా నియామకం పొందిన సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ను, ఎంఐఎం మాజీ కౌన్సిలర్, మాజీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ సాబెర్ అలీ, కరీంనగర్ దారుస్సలాంలో ఆత్మీయంగా సన్మానించారు. ఈసందర్భంగా సాబెర్ అలీ మాట్లాడుతూ..గులాం అహ్మద్ హుస్సేన్ కు, జగిత్యాల జిల్లా బాధ్యతలు కూడా అప్పగించాలని, ఎంఐఎం అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసీ కి విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ నగర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎంఐఎం పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు గులాం అహ్మద్ అలుపెరుగకుండా అహర్నిశలు కృషి చేశారని చెప్పారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మైనారిటీ ప్రజల సమస్యలను పార్టీ...