విజిలెన్స్ తనిఖీల్లో భారతి ఇండస్ట్రీస్ బాగోతం బట్టబయలు

సిద్దిపేట : రంగారెడ్డి జిల్లాలోని ఓ రైస్ మిల్లులో దాచి ఉంచిన పీడీఎస్ రైస్ మూలాలు సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం మోతె గ్రామ శివారులోని భారతి ఇండస్ట్రీస్ లో బట్టబయలైంది. వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, మంగళపల్లి గ్రామ పరిధిలోని న్యూ బన్సల్ రైస్ ఇండస్ట్రీస్‌ లో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్ ) బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచుతున్నట్లు పసిగట్టిన విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పీడీఎస్ రైస్ సీజ్ చేశారు. పీడీఎస్ రైస్ ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారని ఆరా తీసిన అధికారులు.. ఈ మేరకు గత రెండు రోజులుగా సిద్దిపేట జిల్లా అక్బర్...