కలెక్టరేట్ ఎదుట మృతుడి కుటుంబం ధర్నా

ఆత్మహత్యాయత్నం భగ్నం.. మధ్యలబండ తాండ మర్డర్ కేసులో న్యాయం చేయాలని డిమాండ్.. హంతకుల నుంచి ప్రాణహాని ఉందని చంద్రునాయక్ కుటుంబం ఆవేదన.. భూ వివాదం నేపథ్యంలో దారుణ హత్యకు గురైన మధ్యలబండ పెద్ద తాండ వాసి చంద్రునాయక్ (45) కుటుంబ సభ్యులు న్యాయం కోసం రోడ్డెక్కారు. తమకు రక్షణ కల్పించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చంద్రునాయక్ భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు, బంధువులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో వారు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా పోలీసులు వెంటనే స్పందించి అడ్డుకున్నారు. గ్రామం వీడినా వెంటాడుతున్న భయం... గత మే 2 న మల్దకల్...