గ్రామాల రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
లైసెన్స్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలి. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. జిల్లాలోని గ్రామాల భూముల రీసర్వే ప్రక్రియను కచ్చితత్వంతో, పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సర్వే అధికారులను ఆదేశించారు. శుక్రవారం గద్వాల మండలం సంగాల గ్రామపంచాయతీకి సంబంధించిన రీసర్వే పనుల పురోగతిని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రీసర్వేలో భాగంగా ముందుగా గ్రామ సరిహద్దులను కచ్చితంగా గుర్తించి డీమార్కేషన్ చేయాలని సూచించారు. సరిహద్దుల నిర్ధారణకు అందుబాటులో ఉన్న పాత రికార్డులతో పాటు క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించాలని తెలిపారు. అనంతరం సర్వే నంబర్ల వారీగా భూములను గుర్తించి పార్సిళ్లుగా రూపొందించాలన్నారు. ప్రభుత్వ భూములు, రహదారులు, గ్రామకంఠం,...