విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలి
వెనకబడ్డ సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. విద్యార్థులు చదువులో రాణించేందుకు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు తప్పకుండా యూనిఫార్మ్స్ వేసుకొని పాఠశాలకు రావాలని సూచించారు. విద్యార్థులు పాఠశాలకు తక్కువగా రావడంతో తల్లిదండ్రులకి ఫోన్ చేసి విద్యార్థులు పాఠశాలకు వచ్చేలా అవగాహన కలిగించాలన్నారు. విద్యార్థులు దసరా సెలవులను ఎలా గడిపారో అడిగారు. సెలవులకు మందు ఇచ్చిన అసైన్మెంట్స్ ను పూర్తిచేసి ఉపాధ్యాయులకు ఇవ్వాలని సూచించారు. వెనుకబడ్డ సబ్జెక్టులపై...