ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయం

అమర పోలీసు హెడ్ కానిస్టేబుల్ బడే సాహెబ్ కుటుంబాన్ని పరామర్శించిన అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి. సూర్యాపేట, అక్టోబర్ 23:- పోలీసు ఫ్లాగ్ డే వారోత్సవాలు–2026, పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి ఈరోజు సూర్యాపేట పట్టణంలో నివసిస్తున్న పోలీసు అమరవీరుడు హెడ్ కానిస్టేబుల్ బడే సాహెబ్ కుటుంబ సభ్యులను వారి నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల సమక్షంలో బడే సాహెబ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పిస్తూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం విధులు...