ఉత్తమ ఫలితాల సాధనే ధ్యేయంగా బోధన సాగాలి
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి ప్రభుత్వ జూనియర్ కళాశాల తనిఖీలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సులోచన రాణి సూచనలు సూర్యాపేట, 23 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త విలేఖరి:- విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, రాబోయే ఇంటర్మీడియట్ పరీక్షల్లో గత ఏడాది కంటే మెరుగైన ఉత్తీర్ణత సాధించేలా అధ్యాపకులు అంకితభావంతో పనిచేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సులోచన రాణి సూచించారు. శుక్రవారం అకాడమిక్ తనిఖీలో భాగంగా సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ ప్రిన్సిపల్ పెరుమాళ్ళ యాదయ్య అధ్యక్షతన కళాశాలను సందర్శించి, కళాశాలలో విద్యా కార్యక్రమాల అమలు తీరును పరిశీలించి అధ్యాపకులకు దిశానిర్దేశం చేశారు. కళాశాలలో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు కార్యాచరణ రూపొందించాలని, విద్యార్థుల హాజరు శాతాన్ని...