అణగారిన వర్గాల ఆశాజ్యోతి పండుగ సాయన్న.

ముఖ్యమైన పాయింట్స్:జయంతి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్. దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా సాయన్న పోరాటం. జయంతి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్. గద్వాల:- భూస్వాముల దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసి, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా పండుగ సాయన్న నిలిచారని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. గురువారం తెలంగాణ పోరాట యోధుడు పండుగ సాయన్న జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐడిఓసి ఆవరణలో అధికారికంగా కార్యక్రమం నిర్వహించారు. పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, తెలుగు ముదిరాజ్ సంఘం నేతలు సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతిధులు మాట్లాడుతూ బుర్రకథలు, జానపద పాటల ద్వారా పలువురు కళాకారులు సాయన్న...