పార్టీ మారినందుకు బహుమతా..?
రూ. 20 కోట్ల భూమిని ఉచితంగా కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం.. కోర్టు కేసు ఉపసంహరణ.. మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌కు తగిలిన జాక్‌పాట్.! భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు, రాజకీయ నాయకుడు యూసుఫ్ పఠాన్, గుజరాత్‌లోని వడోదరా ప్రాంతంలో ఉన్న తన బంగ్లాకు ఆనుకుని ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసే విషయంలో చాలా కాలంగా చట్టపరమైన పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, గుజరాత్ ప్రభుత్వం ఈ వ్యవహారంలో యూసుఫ్ పఠాన్‌కు అనుకూలంగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రూ. 15 కోట్ల వరకు ప్రయోజనం: వడోదరా మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 978 చదరపు మీటర్ల స్థలాన్ని ఆయనకు కేటాయించే ప్రణాళికకు గుజరాత్ ప్రభుత్వం ఆమోదం...