అష్టాదశ శక్తిపీఠాలు నిర్మాణం పూర్తి ఎప్పుడో ?

ముఖ్యమైన పాయింట్స్:జమ్మిచేడు జమ్ములమ్మ ఆలయం దారిలో నిర్మాణాలు పూర్తయితే జమ్ములమ్మ బ్రహ్మోత్సవాలకు మరింత శోభ.. దక్షిణ తెలంగాణలోనే ప్రత్యేక ఆధ్యాత్మిక కేంద్రంగా గద్వాల. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల భక్తులచే కొలువబడుతున్న జమ్మిచేడు జమ్ములమ్మ దేవి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఏటా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఉత్తర తెలంగాణలో సమ్మక్క–సారలమ్మ జాతర ఎంతటి ప్రాధాన్యతను సంతరించుకుందో, దక్షిణ తెలంగాణలో జమ్ములమ్మ జాతర, బ్రహ్మోత్సవాలు కూడా అంతటి వైభవాన్ని సంతరించుకోవాలన్నది భక్తుల ఆకాంక్ష. ఈ నేపథ్యంలో జమ్ములమ్మ ఆలయ ప్రాంగణంలో అష్టాదశ శక్తిపీఠాలను నిర్మించాలన్న సంకల్పానికి...