సిద్ధిపేట కమీషనరేట్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
సిద్దిపేట:- పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని సిద్ధిపేట పోలీస్(siddipet police) కమిషనరేట్ కార్యాలయంలో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. దేశ రక్షణ కోసం, ప్రజల ప్రాణాస్తుల రక్షణకై విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు సిద్ధిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఐపీఎస్, అదనపు డీసీపీలు, అధికారులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపి రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ,పోలీస్ శాఖ అనేది ప్రతిరోజూ 24 గంటలూ పనిచేసే విభాగామని, పండుగలు, సెలవులు అనే తేడా లేకుండా సిబ్బంది నిరంతరం ఆన్ డ్యూటీలో ఉంటూ ప్రజల రక్షణ కోసం శ్రమిస్తున్నారని కొనియాడారు. 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా సైన్యం పొంచి...