శ్రీకాంత్ గౌడ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కుందూరు దేవేందర్ రెడ్డి. సూర్యాపేట ను కరువు జిల్లాగా ప్రకటించాలి. సూర్యాపేట: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల శాసన మండలి అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ ను తొలిసారిగా బరిలో నిలుపుతున్నామని పట్టబద్రులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూర్యాపేట జిల్లా తెలంగాణ రక్షణ సేన పార్టీ జిల్లా అధ్యక్షులు కుందూరు దేవేందర్ రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలోని ఎస్వికే గ్రాండ్ హోటల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు కవిత ఆదేశాల...