విజయవాడలో రూ.5.84 కోట్ల బంగారం పట్టివేత..!!

విజయవాడ శివార్లలో భారీగా విదేశీ కరెన్సీ, అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. మొత్తం రూ.5.84 కోట్ల విలువైన సొత్తును పట్టుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. త‌నిఖీల్లో భాగంగా ఒక‌ స్కార్పియో వాహనాన్ని ఆపి ప‌రిశీలిస్తుండ‌గా, రహస్య అరలో బంగారం, 60 వేల అమెరికన్ డాలర్లు, 21,500 యూరోలు లభించాయి..!!