సౌమ్య చిల్డ్రన్స్ ఆసుపత్రిలో వికటించిన వైద్యం పై నేటికీ మోక్షం లేదు. కొనసాగుతున్న చికిత్సలు.
జోగులాంబ గద్వాల 19 అక్టోబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల పట్టణ కేంద్రంలోని సౌమ్యా చిల్డ్రన్స్ ఆసుపత్రిలో గత మూడు నెలల క్రితం వైద్యం వికటించి మూడు నెలల చిన్నారి మృతి చెందిన సంఘటనపై ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి నివేదికను పంపినట్లు వెల్లడించారు. మృతి చెందిన సంఘటనపై ఎటువంటి వివరాలు వెల్లడించకపోవడం తో ప లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం మూలంగా నిండు ప్రాణం బలైపోయిన ఆ కుటుంబం ఉన్న డబ్బులన్నీ ఆసుపత్రిపాలై దిక్కు తోచని పరిస్థితుల్లో బిడ్డను కోల్పోయి నేటికీ ఆ కుటుంబం అల్లాడుతూనే ఉంది. వైద్యులు కప్పిపుచ్చుకోవడానికి పలు పన్నాగాలు పని సమాప్తం చేసినట్లు కనబడుతుంది. సౌమ్య చిల్డ్రన్స్ ఆసుపత్రి.వైద్యుల...