రేపు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. దసరా వేడుకల కోసం సొంతూరికి వెళ్లనున్నారు. భూగర్భ మురుగు నీటిశుద్ధి కేంద్రం, పీహెచ్‌సీ ప్రారంభించనున్నారు. మూడు ఏటీసీ కేంద్రాలకు శంకుస్థాపన చేయనున్నారు.