వ్యాక్సిన్ల కొరతతో చిన్నారుల తల్లిదండ్రుల అవస్థలు.. అనర్హుడైన సీహెచ్వో నరేంద్రను తక్షణమే తొలగించాలి
* బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్. రామచంద్రా రెడ్డి. జోగులాంబ గద్వాల 19 అక్టోబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి. ఐజ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పెంటావ్యాలెంట్, రోటా వైరస్ వ్యాక్సిన్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు. అయిజ. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పెంటావ్యాలెంట్ మరియు రోటా వైరస్ వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్. రామచంద్రా రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఆయన అయిజ పీహెచ్సీని సందర్శించి, వ్యాక్సిన్లు దొరకక ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రుల ఆవేదనను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎలాంటి...