దామన్న విగ్రహావిష్కరణకు జనసంద్రం

పబ్లిక్ క్లబ్ ఫంక్షన్ హాల్‌లో అంగరంగ వైభవంగా మహోత్సవం.. ఆత్మీయ నేత విగ్రహం ముందు కన్నీటిపర్యంతమైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి గారు.. విగ్రహ ఆవిష్కరణ లో పాల్గొన్న జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామరావు గారు సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు స్వర్గీయ టైగర్ శ్రీ రాంరెడ్డి దామోదర్ రెడ్డి విగ్రహావిష్కరణ మహోత్సవం సూర్యాపేట పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రివర్యులు అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కార్యక్రమ ప్రాంగణం సందడిగా మారింది. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు... స్వర్గీయ శ్రీ రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారికి...