గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

తెలంగాణ గీత పనివారల సంఘం ఘనంగా 70వ వార్షికోత్సవాలు ధర్మభిక్షం భవన్‌ ఎదుట జెండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు రేగటి లింగయ్య సూర్యాపేట: తెలంగాణ గీత పనివారల సంఘం వ్యవస్థాపకులు బొమ్మగాని ధర్మభిక్షం ఆశయాలతో ముందుకు సాగుతూ, గీత కార్మికుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో సంఘం ఆవిర్భవించి 69 సంవత్సరాలు పూర్తయి 70వ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ధర్మభిక్షం భవన్‌ ఎదుట జిల్లా అధ్యక్షుడు రేగటి లింగయ్య జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొమ్మగాని ధర్మ బిక్షం గీత కార్మికుల కష్టాలు చూసి గీతా పనివారల సంఘం 1957లో అక్టోబర్ 19న అప్పటి వరంగల్...