దసరాకు ఊరెళ్తున్నారా..? దొంగల పట్ల అప్రమత్తంగా ఉండండి!

ముఖ్యమైన పాయింట్స్:ఎస్సై కొండా శ్రీహరి మల్దకల్:- దసరా పండుగ సెలవులకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలు తమ ఇళ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మల్దకల్ ఎస్సై కొండా శ్రీహరి సూచించారు. పండుగ సందర్భంగా ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు తలుపులు, కిటికీలు సరిగ్గా మూసి తాళాలు వేసుకోవాలని తెలిపారు. బంగారు ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో తెలియజేయకుండా జాగ్రత్త పడాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, దొంగతనానికి సంబంధించిన అనుమానాలు కలిగినా వెంటనే...