ఉల్లిగేపల్లిలో యథేచ్ఛగా అక్రమ మట్టి దందా..!

ముఖ్యమైన పాయింట్స్:అధికారుల అనుమతి ఉందంటూ మట్టి తరలింపు.. ట్రాక్టర్ మట్టి రూ.500–600కు విక్రయం..? జోగులాంబ గద్వాల 19 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- మల్దకల్ మండలం ఉల్లిగేపల్లి గ్రామంలో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ వద్ద మట్టిని అక్రమంగా తరలిస్తూ వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.గ్రామ అభివృద్ధి చెరువుకు నీటిని తరలించే పనుల ముసుగులో మట్టిని ట్రాక్టర్‌కు రూ.500–600 చొప్పున విక్రయిస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.పోలీస్,ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల అనుమతులతోనే మట్టి తరలిస్తున్నామని కొందరు చెబుతున్నట్లు సమాచారం.ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు స్పందించి,మట్టి తరలింపునకు అనుమతులు ఉన్నాయా..? అక్రమ మట్టి దందా జరుగుతోందా..? అనే అంశాలపై విచారణ చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.