సూర్యాపేట—ఖమ్మం జాతీయ రహదారిపై యాక్సిడెంట్
అదుపుతప్పిన కార్ పల్టీ... కార్ లో 3 ముగ్గురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు తప్పిన పెనుప్రమాదం సూర్యాపేట –ఖమ్మం జాతీయ రహదారి పిల్లలమర్రి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు అతివేగంతో అదుపుతప్పి సర్వీస్ రోడ్డులోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ప్రయాణిస్తుండగా స్వల్ప గాయాలయాలతో బయటపడ్డారు. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...