గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాలు అందజేసిన సర్పంచ్ చేడే అంబేద్కర్

అడ్డగూడూరు 19 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కంచనపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణంలో విజయదశమి పండుగ సందర్భంగా కంచనపల్లి గ్రామ పంచాయతీ సిబ్బందికి సర్పంచ్ చెడే అంబేద్కర్ నూతన వస్త్రాలను అందజేశారు. మాట్లాడుతూ..గ్రామాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచుతూ..అభివృద్ధికి తోడ్పడుతున్న సిబ్బంది సేవలను ఆయన ప్రత్యేకంగా గమనించి అభినందించారు. దసరా పండుగ పూట సిబ్బంది అందరూ తమ కుటుంబాలతో ఆనందంగా ఉండాలని దసరా పండుగను గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గం,సిబ్బంది పాల్గొన్నారు.