దసరా పండుగను ప్రశాంతంగా, సంతోషంగా జరుపుకోవాలి.
- ప్రజల భద్రతకు పోలీస్ శాఖ నిరంతర పర్యవేక్షణ. – జిల్లా ఎస్పీ కె. నరసింహ సూర్యాపేట సూర్యాపేట జిల్లా ప్రజలందరూ దసరా పండుగను సంతోషంగా, ఆనందోత్సాహాలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ సూచించారు. పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. పండుగ వేళ ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని, ఇతరుల మనోభావాలను దెబ్బతీయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. బెట్టింగ్లు, జూదం, గొడవలు, తగాదాలకు దూరంగా ఉండాలని, పండుగలను సంప్రదాయబద్ధంగా, సోదరభావంతో జరుపుకోవాలని కోరారు. దసరా సెలవుల్లో దూర ప్రాంతాలకు ప్రయాణించే వారు రోడ్డు భద్రతా నియమాలు...