హుస్సేన్ సాగర్ తీరాన అట్టహాసంగా ప్రారంభమైన సద్దుల బతుకమ్మ సంబరాలు!
సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా – జానకి దంపతులు వేడుకలకు హాజరైన పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కార్యక్రమంలో పాల్గొన్న పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణీప్రసాద్ 720 మంది కళాకారులతో 30 కళారూపాల ప్రదర్శన 700 బతుకమ్మలతో హుస్సేన్ సాగర్ తీరాన సందడి చేసిన ఆడపడుచులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళారూపాల వైభవాన్ని చాటుతున్న సద్దుల బతుకమ్మ సంబరాలు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలందరికీ, ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మన బతుకును కోరే అమ్మ బతుకమ్మ. బతుకమ్మ ఆడే ఆడపడుచులంతా...