కోలాటాలు, పాటలతో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు

ముఖ్యమైన పాయింట్స్:తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల తో బతుకమ్మకు వీడ్కోలు సూర్యాపేట : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం అత్యంత వైభవంగా ముగిశాయి. ఆశ్వయుజ అష్టమి సందర్భంగా జరుపుకునే సద్దుల బతుకమ్మతో తొమ్మిది రోజుల పూల పండుగకు ముగింపు పలికారు. అక్టోబర్ 10న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా పట్టణంలో సద్దాలచెరువు, విద్యానగర్, భగత్ సింగ్ నగర్, జమ్మిగడ్డ, కృష్ణ టాకీస్ తో పాటు పలు ప్రధాన సెంటర్ లలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను తయారు చేసి మహిళా ల నుంచి వృద్ధుల...