వెల్దేవి గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

అడ్డగూడూరు 18 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం పరిధిలోని వెల్దేవి గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. గ్రామంలోని చిన్నపిల్లలు, మహిళలు, ఆడపడుచులందరూ తెలంగాణ ప్రధాన ప్రకారం నూతన వస్త్రాలు ధరించి తీరోక్క పువ్వులతో బతుకమ్మను పేర్చి డప్పు వాయిద్యాల మధ్య ఒక్కచోటికి చేరి మధ్యలో బొడ్డెమ్మ పెట్టి డీజే పాటలతో ఆడుతూ.. పాడుతూ.. నాట్యం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు గ్రామ ఆడపడుచులు తదితరులు పాల్గొన్నారు.