వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
ముఖ్యమైన పాయింట్స్:చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో సేవా స్ఫూర్తి.. 200 మంది వలసదారులకు అన్నదానం ఖమ్మం : జస్టిస్ ఫర్ సోషల్ పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ (జేఎస్పీడబ్ల్యూ) ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ వలసదారులకు అన్నదానం నిర్వహించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేనేజర్ దాట్ల రవితేజ, దివ్య దంపతుల కుమార్తె హద్విత పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది వలసదారులకు అన్నదానం నిర్వహించారు. సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు పెదపాక రమేష్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నామా వినోద్ కుమార్, ఉపాధ్యక్షుడు వేముల సీతారామారావు, సంయుక్త కార్యదర్శి మహమ్మద్ అస్గర్,...